'దళితులకు 27 సంక్షేమ పథకాలను దూరం చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కింది'
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 26, 2024, 1:35 PM IST
Dalit Leaders Anger On YSRCP Govt in Kurnool District : దళితులకు అమలు అవుతున్న 27 సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందని దళిత నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో (Elections) తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కర్నూలులో దళిత చైతన్య యాత్ర పేరుతో తెలుగుదేశం, జనసేన నేతలు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అమలు అయ్యే సంక్షేమ పథకాలను వారికి వివరించారు.
ఈ యాత్రలో భాగంగా కర్నూలు (Kurnool) నగరంలోని 51వ వార్డు కొత్తపేటలో జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అమలు అయ్యే పథకాలను వివరించారు. ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుందని టీడీపీ నేతలు (TDP Leaders) ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు దళితులకు ముద్దులు పెట్టిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు.