బ్యాంక్ ఖాతా హ్యాక్ చేసి ₹5 లక్షలు చోరీ- 3 దఫాలుగా దగా - Cyber Fraud in Kurnool Disrtict - CYBER FRAUD IN KURNOOL DISRTICT
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 18, 2024, 5:13 PM IST
Cyber Fraud in Kurnool Disrtict Bank Account Hacked ₹5 Lakhs Were Stolen : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కొటేకల్‌లో ఓ వ్యక్తి సైబర్ క్రైమ్ బారిన పడ్డాడు. బాధితుని బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేసి 5 లక్షల రూపాయలను చోరీ చేశారు. సెల్‌ఫోన్‌లోని మొబైల్ బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేసి 3 దఫాలుగా నగదు చోరీ చేశారని బాధితుడు తెలిపాడు. ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇటీవల మారతున్న కాలానికి అనుకూలంగా టెక్నాలజీ పెరిగిపోతోంది. అయితే దీంతో మంచి, చెడు రెండూ ఒకే మోతాదులో ఉన్నది వాస్తవం. ఇది సైబరాసురులకు మంచి అస్త్రంగా మారిందనే చెప్పొచ్చు. అభివృద్ది చెందుతున్న సాంకేతికను స్వలాభాల కోసం అక్రమంగా డబ్బు సంపాదించడానికి వాడుతున్నారు కొందరు. బ్యాంక్ ఖాతలను హ్యాక్ చెయ్యడం, ప్రజల్లో నమ్మకంగా ఉన్న బ్యాంక్‌ల పేరిట లింక్‌లు పంపుతూ సాధారణ ప్రజలు ఖాతాలు లూటీ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.