ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

నెల్లూరు జిల్లాలో విషాదం - విద్యుదాఘాతానికి దంపతులు బలి - wife And husband current shock - WIFE AND HUSBAND CURRENT SHOCK

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 24, 2024, 12:18 PM IST

Current Shock Wife And Husband Dead in Nellore District : కష్టనష్టాలు, సుఖసంతోషాల్లో కలిసి ఉంటామని ప్రమాణం చేసిన దంపతులు మరణంలోనూ ఒకరికి ఒకరు తోడుగా ఉన్న ఈ హృదయ విదారక సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. తోటపల్లిగూడూరు మండలం చిన్నచెరుకూరు గ్రామంలో అన్నం నరసయ్య(60), భాగ్యమ్మ(55) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. నరసయ్య కల్లుగీత కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. 

రోజులాగే బుధవారం రాత్రి ఇంటి వరండాలో నిద్రించిన నరసయ్య, గురువారం వేకువజామున కల్లు గీతకు వెళ్లేందుకు నిద్రలేచారు. ఈ నేపథ్యంలోనే మంచం పక్కనే ఉన్న ఫ్యాన్ తీగలు తగిలి విద్యుదాఘాతంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ క్రమంలోనే తన భర్తకు ఏం జరిగిందో అన్న ఆందోళనతో భాగమ్మ పరుగున వచ్చి అతన్ని పట్టుకుంది. దీంతో ఆమె కూడా విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడింది. అనుకోని ప్రమాదంలో దంపతులు ఇద్దరూ విద్యుదాఘాతంతో మృతి చెందారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details