ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వంజంగి వెళ్లే రహదారిలో కొట్టుకుపోయిన కల్వర్టు - వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Culvert Washed Away Due to Heavy Rains in Alluri District : అల్లూరి జిల్లా అనంతగరి మండలంలో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షానికి పినకోట పంచాయతీ నుంచి వంజంగి వెళ్లే రహదారిలో కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో దాహార్తి, వంజంగి, రాచగలము, గుమ్మంతి, గుర్రాల బండ వేళ్లే గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ రహదారులు దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు స్పందించి నూతన కల్వర్టు నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

పర్యాటక ప్రాంతమైన వంజంగికి వెళ్లే రహదారిలో కల్వర్టు కొట్టుకుపోవడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. ఎన్నో ఆశలతో పర్యాటకులు వస్తుంటే అక్కడ కనీస వసతులు కల్పించకపోగా, వెళ్లే మార్గం కూడా సరిగ్గా లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని పర్యాటకులు కోరుతున్నారు. రహదారి సరిగ్గా లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details