యాదాద్రిలో భక్తుల రద్దీ - ఉచిత దర్శనానికి 2 గంటలు - Crowd devotees increased in Yadadri - CROWD DEVOTEES INCREASED IN YADADRI
Published : May 5, 2024, 6:37 PM IST
Devotees Rush in Yadadri Temple : రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో మొక్కులు తీర్చుకోవడానికి వచ్చారు. స్వామి వారి దర్శనానికి తెల్లవారుజామున నుంచే క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. దీంతో ఉచిత దర్శనానికి దాదాపు 2 గంటలు సమయం, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది.
Yadadri Lakshmi Narasimha Swamy Temple Rush : ఆలయంలో స్వామి వారి అభిషేక పూజల్లో, నిత్య కల్యాణంలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువ ఉండటంతో ప్రసాద విక్రయ శాల, ఆలయ ఆవరణంలో భక్తులు సందడి నెలకొంది. ఎండలు ఎక్కువగా ఉన్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. తాగు నీటి సదుపాయం, పరుపులు, నీడ కోసం పందిర్లు తదితర సౌకర్యాలను భక్తులకు కల్పించామని అన్నారు.