బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే ఏ పార్టీకైనా మద్ధతిస్తాం: శ్రీనివాసరావు - Srinivasa Rao media conference
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 14, 2024, 7:38 PM IST
CPM State Secretary Srinivasa Rao on BJP : రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి (BJP) ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్ధతు ఇచ్చే పార్టీలను ఓడించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె. శ్రీనివాసరావు సృష్టం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే ఏ పార్టీకైనా మద్ధతిస్తామని అన్నారు. బీజేపీకి వివిధ అంశాల వారీగా మద్ధతిస్తున్నామని తిరుపతి సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించడం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడమేనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలపై జగన్ ఎన్ని లక్షల కోట్ల భారాలను వేశారో తెలియజేయాలని పేర్కొన్నారు.
రాష్ట్రంలో వైసీపీ పార్టీకే కాదు, టీడీపీ-జనసేన కూటమికి ఓటు వేసిన బీజేపీకే వేసినట్లే అని శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో 26 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాల్లో తమ పార్టీ బలంగా ఉందని పేర్కొన్నారు. అమరావతి రాజధానిగా ప్రకటించడానికి జగన్ మోహన్ రెడ్డి అభ్యంతరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనాలు అమలుపై అధికార పార్టీ తమ వైఖరిని వెల్లడించాలని కోరారు.