జనం సొమ్ముతో జగన్ ఎన్నికల ప్రచారం: శ్రీనివాసరావు - ap political news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 24, 2024, 6:12 PM IST
CPM State Secretary Srinivasa Rao Challenges CM Jagan : ప్రజలే తన స్టార్ క్యాంపెయినర్లు అంటున్న జగన్కు ధైర్యముంటే ఐపాక్ టీంను రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు సవాల్ విసిరారు. జనం సొమ్ముతో జగన్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ అడ్డదారుల్లో గెలవాలని కుట్ర పన్నిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే అధికార యంత్రాంగాన్ని ఎన్నికల సంఘం తన అధినంలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఆర్థిక భారం వల్ల స్టార్ క్యాంపెయినర్లే కాదు ప్రభుత్వ వ్యతిరేకులు కూడా ఉన్నారని శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ముందుగా ఎన్నికల బాండ్లను నిషేధించాలని డిమాండ్ చేశారు. అధికార ప్రభుత్వం ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. ఎన్నికలకు 2 నెలల వ్యవధిలోనే అధికార ప్రభుత్వమే ఓటర్ జాబితాను విడుదల చేస్తుందని వ్యాఖ్యానించారు. అధికార ప్రభుత్వం స్వేచ్ఛగా ఎన్నికల ప్రచారం చేసుకుంటారు, విపక్ష నాయకులపై కేసులు, అరెస్ట్లు, నిర్భందాల పేరుతో కట్టడి చేస్తారని దుయ్యబట్టారు.