ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రైతుల భూములు కాజేసే చట్టం : సీపీఐ రామకృష్ణ - CPI Ramakrishna on Land Titling Act - CPI RAMAKRISHNA ON LAND TITLING ACT

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 4, 2024, 4:43 PM IST

CPI Ramakrishna Comments on Land Titling Act: వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్టుగా మారనుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్‌ చిన్న, సన్నకారు రైతుల భూములు కాజేయడానికి తెచ్చిన చట్టమని ఆరోపించారు. భూమి ఉన్న ఏ రైతు కూడా ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ను సమర్థించరని అన్నారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు సీఎం జగన్‌ ప్రకటన విడుదల చేయాలని సీపీఐ తరఫున డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఈ చట్టంపై అజయ్ కల్లంతో మాట్లాడిస్తూ ఓటర్లను మరోసారి మోసగించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. భూమి ఉన్న ఏ రైతు కూడా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్​ను సమర్థించరని ఆయన అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ చట్టం తీసుకొస్తోందని జగన్ చెబుతున్నారుని అలా అయితే ఇతర రాష్ట్రాల్లో ఎందుకు అమలులో లేదని ప్రశ్నించారు. పింఛన్లు పంపిణీకి ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బందిని ఉపయోగించటానికి ప్రభుత్వానికి ఏమి ఇబ్బందని రామకృష్ణ ప్రశ్నించారు. పింఛన్ దారులను ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతోనే ప్రభుత్వం రాజకీయ లబ్దికోసం కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోతున్న పింఛన్ దారుల ఉసురు ఐఏఎస్ అధికారులకు తప్పనిసరిగా తగులుతుందని రామకృష్ణ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details