వైఎస్సార్సీపీ మద్దతుతోనే విశాఖ కేంద్రంగా డ్రగ్స్ వ్యాపారం: సీపీఐ నేత రామకృష్ణ - Ramakrishna fire on ycp government - RAMAKRISHNA FIRE ON YCP GOVERNMENT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 22, 2024, 6:44 PM IST
CPI Leader Ramakrishna Fire on YCP Government : వైఎస్సార్సీపీ మద్దతుతోనే విశాఖ కేంద్రంగా డ్రగ్స్ వ్యాపారం సాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. మత్తు పదార్థాలు డంప్ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్ రాకెట్‌లో ఉన్న ఏ ఒక్కరినీ వదలొద్దని వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విశాఖ పోర్టులో దాదాపు లక్ష కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి డ్రగ్స్ వినియోగం వల్ల ఎన్నికుటుంబాలు నాశనం అవుతున్నాయో చూస్తునే ఉన్నాం. రాష్ట్రాన్ని కేంద్రంగా చేసుకొని దేశం మెుత్తం డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు అనుమానం కలుగుతుందని తెలిపారు.
ఇదంతా అధికార పార్టీ మద్దతుతోనే జరుగుతుంది. అందుకే సంధ్యా ఆక్వా పేరుతో వైసీపీ నేతలు డ్రగ్స్ దిగుమతి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇంత ఘోరానికి పాల్పాడి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడే ఎంతటి వారికైనా శిక్షపడాలని డిమాండ్ చేశారు. ఇందులో వైసీపీ నాయకులతో పాటు కొంతమంది అధికారులు సైతం ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డిని కాపాడటం ఇప్పటికైనా మాని దీనిపై తగు చర్యలు తీసుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.