ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తాగునీటి సరఫరా బిల్లుల కోసం కాంట్రాక్టర్ల ధర్నా- గొంతెండుతున్న ప్రజలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 18, 2024, 3:48 PM IST

Contractors Protest Water Bills in Annamayya District : తాగునీటి సరఫరా బిల్లులు చెల్లించాలంటూ అన్నమయ్య జిల్లా మదనపల్లె గ్రామీణ నీటి సరఫరా శాఖ కార్యాలయం ఎదుట తంబళ్లపల్లె నియోజకవర్గంలోని గుత్తేదారులు ఆందోళన (Protest) చేశారు. కార్యాలయం ప్రధాన గేటును మూసివేసి సిబ్బందిని లోనికి అనుమతించకుండా అడ్డుకున్నారు. బిల్లులు చెల్లించాలని చాలా సార్లు అధికారులను కోరినా నిర్లక్ష్యం చేశారని వాపోయారు. పోలీసులు (Police) అక్కడికి చేరుకుని గుత్తేదారులతో మాట్లాడి కార్యాలయ సిబ్బందిని లోనికి పంపించారు.

ఏళ్ల తరబడి ప్రభుత్వం గుత్తేదారుల బిల్లులు పెండింగ్ (Pending)​ పెట్టడంతో ఈ వేసవిలో తమకు తాగు నీటి సమస్య  తీరేదెలా అని ప్రజలు వాపోతున్నారు. గొంతెండుతున్నా అధికారులకు మా గోస కనబడదా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు రూపాయల వడ్డీతో అప్పు తెచ్చి మరీ నీటి సరఫరా (Drinking Water Supply) చేస్తే ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఓ గుత్తేదారు అసంతృప్తి వెల్లబుచ్చాడు.  

ABOUT THE AUTHOR

...view details