హైడ్రాను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి - MLC Jeevn Reddy On Hydra - MLC JEEVN REDDY ON HYDRA
Published : Aug 25, 2024, 7:41 PM IST
MLC Jeevan Reddy On Hydra : హైడ్రాను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చెరువులు, కుంటలు అక్రమణలు జరిగాయని తెలిపారు. హైదరాబాద్లోని పలు ఆక్రమణల కూల్చివేతపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేయటం మానుకోవాలని అన్నారు. జగిత్యాలలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ప్రజలు హర్శిస్తున్నారని తెలియజేశారు. జలాశయాల నిబంధనల పరిరక్షణకు అనుగుణంగా రాష్ట్రంతో పాటు పట్టణాలకు అనుబంధంగా ఉన్న వాటిలో కూడా ఆక్రమణలు పెరిగాయని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసి చెరువులు, కుంటల్లో ఆక్రమణలు కూల్చివేయాలని రేవంత్ రెడ్డిని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాను విస్తరించాలని జీవన్ రెడ్డి, అడ్లూరి సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే శాసన సభ్యులతో చర్చించిన తర్వాత, వారి ఆమోదంతోనే తీసుకుంటుందని, అంతేగానీ వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోదని అడ్లూరి తెలిపారు.