కరువుతో అల్లాడుతున్న కడప జిల్లా రైతులకు పరిహారం చెల్లించాలి: తులసిరెడ్డి - Kadapa Drought Conditions - KADAPA DROUGHT CONDITIONS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 4, 2024, 3:54 PM IST
Congress Leader Tulasi Reddy on Kadapa Drought Conditions: కడప జిల్లాలో కరవు రక్కసి కరాళ నృత్యం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి అన్నారు. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని ఖరీఫ్ సీజన్లో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. 7 వేల హెక్టార్ల పంట ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి కోరారు.
"కడప జిల్లాలో కరవు రక్కసి కరాళ నృత్యం చేస్తోంది. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఖరీఫ్ సీజన్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలో సాగు చేసిన 17 వేల హెక్టార్లలో 7 వేల హెక్టార్లలో పంట ఇప్పటికే ఎండిపోయింది. మిగితా చోట్ల కూడా పంట ఎండిపోయేందుకు సిద్ధంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నాను." - తులసిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మీడియా ఛైర్మన్