విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోంది: తులసిరెడ్డి - Tulasi Reddy Fires On BJP - TULASI REDDY FIRES ON BJP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 15, 2024, 2:44 PM IST
Congress Leader Tulasi Reddy Fires On BJP Government: రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీనే నెంబర్ 1 ద్రోహి అని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి విమర్శించారు. బీజేపీ చేతిలో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు కీలుబొమ్మలుగా మారడం దుర్మార్గమని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం, స్టీల్ ప్లాంట్ తదితర విషయాలపై బీజేపీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని తులసి రెడ్డి అన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలని బీజేపీ ప్రయత్నింస్తోందని ఆయన మండిపడ్డారు.
బీజేపీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు వైసీపీ పూర్తిగా మద్ధతు తెలిపిందని ఆయన పేర్కొన్నారు. జగన్ ఏపీ ప్రయోజనాలను బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారని ఆయన లేవనెత్తారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి అధికార పార్టీని ఒడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తులసి రెడ్డి పేర్కొన్నారు. 2024లో అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నామని గతంలో తెలిపారు. విభజన హామీల్లో పేర్కొన్న విశాఖ రైల్వేజోన్‌ను (Visakha Railway Zone) ఏర్పాటు చేయకుండా బీజేపీ మోసం చేసిందని తులసి రెడ్డి మండిపడ్డారు.