అగ్రంపహాడ్ సమ్మక్క జాతరలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గీయుల మధ్య వాగ్వాదం - Congress and BRS Activists Clash
Published : Feb 23, 2024, 7:30 PM IST
Congress and BRS Activists fight in Agrampadu Sammakka Jatara : హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపాడు సమ్మక్క సారలమ్మ జాతర వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్(BRS) మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వర్గీయులకు, ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గీయుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి అనుచరులు చల్లా జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
Congress and BRS Activists Clash at Sammakka Saralamma Mini Jatara : దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను అదుపు చేశారు. దీంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దంపతులు సమ్మక్క, సారలమ్మను దర్శనం చేసుకుని వెళ్లిపోయారు.