నారాయణఖేడ్‌లో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ - Congress and BJP Leaders clashes
Published : May 13, 2024, 3:54 PM IST
Clash Between Congress and BJP Leaders in Narayankhed : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. మరోవైపు ఈ క్రమంలోనే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సోదరుడు బీజేపీ కార్యకర్తలపై దాడికి పాల్పడటంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఎన్నికల పోలింగ్ కోసం ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ సోదరుడు నగేష్ షెట్కార్ దాడి చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులను వెంటనే వెంటనే రంగంలో దిగి గొడవను శాంతింపజేశారు. తమ పార్టీ శ్రేణులైన సంతోష్, శ్రీనివాస్ తదితరులపై నగేష్ షేట్కార్ దాడికి దిగారని బీజేపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి సంగప్ప అన్నారు. వారిపై గత కొన్ని రోజులుగా బెదిరింపులకు దిగిన నగేష్ ఈరోజు ప్రత్యక్షంగా దాడి చేశారని ఆరోపించారు. దీనిపై ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేశామని బాధ్యులపై వెంటనే చర్య తీసుకోవాలని సంగప్ప డిమాండ్ చేశారు.