వెంగముక్కపాలెంలో టీడీపీ నేతల ఆందోళన- దాడి చేసి ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీకే పోలీసుల మద్దతు - TDP Leaders Concern in Ongole - TDP LEADERS CONCERN IN ONGOLE
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 15, 2024, 4:53 PM IST
Concern of TDP Leaders in Police Try to Arrest: ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం వెంగముక్కపాలెంలో వైఎస్సార్సీపీ మూకల దాడిలో బాధితులుగా ఉన్న వారిని పోలీసులు అరెస్టు చేసేందుకు యత్నించగా తెలుగుదేశం నాయకులు అడ్డుకున్నారు. పోలింగ్ రోజున వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్యరెడ్డి వెంగముక్కపాలెం పోలింగ్ బూత్‌లో హల్‌చల్ చేయటంపై టీడీపీ ఏజెంట్ అభ్యంతరం చెప్పారు. దీంతో అక్కడ నుంచి వెళ్లిపోయి కక్షపూరితంగా కావ్యరెడ్డి అనుచరులతో కలిసి టీడీపీ ఏజెంట్ ఇంటిపై అర్ధరాత్రి దాడి చేసి తిరిగి వారిపై కేసు పెట్టారు.
దీనిపై ఈ రోజు వెంగముక్కపాలెం పోలీసులు తెలుగుదేశం వారిని అరెస్టు చేసేందుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్ తన న్యాయవాదులతో వెంగముక్కపాలెం చేరుకొని పోలీసులను అడ్డుకున్నారు. బాలినేని కుటుంబ సభ్యులు పోలింగ్ రోజు వెంగముక్కపాలెంలో హల్‌చల్ చేస్తే టీడీపీ శ్రేణులను ఇరికించే యత్నం చేస్తున్నారని విమర్శించారు. దీంతో పోలీసులు ఏమీ చేయలేక వెనుదిరిగారు.