ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పెన్న అహోబిలం ఆలయ ఆవరణలోని దుకాణాల్లో జగన్ ఫోటో - భక్తుల అసహనం - CM YS Jagan Photo at Penna Ahobilam - CM YS JAGAN PHOTO AT PENNA AHOBILAM

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 26, 2024, 7:16 PM IST

CM YS Jagan Photo at Penna Ahobilam Temple Shops: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నఅహోబిలం శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ఆవరణలోని దుకాణాలలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫొటోలు పెట్టడం విమర్శలకు తావిస్తోంది. దుకాణాలలో ముందు భాగంలో జగన్మోహన్ రెడ్డి ఫొటోలు ప్రదర్శిస్తూ భక్తులు చూసే విధంగా ప్రదర్శించారు. బ్రహ్మోత్సవాలకు వెళ్లే భక్తులు చూసేలా దుకాణంలో జగన్ ఫొటోను ప్రదర్శనకు పెట్టడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉందా లేదా అనే సందేహం కలుగుతోందని భక్తులు మండిపడుతున్నారు. 

ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలలో ఫొటోలు ఉన్నా కూడా అలయ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. జగన్ ఫొటోలను ప్రదర్శిస్తూ ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి ఫొటో దేవుళ్ల చిత్రాల పక్కనే పెట్టడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఎన్నికల నిబంధనల ప్రకారం కోడ్​ను అమలు చేయాలని భక్తులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details