LIVE : వరద నష్టంపై అధికారులతో సీఎం సమీక్ష - CM Revanth Visit Flood Affect Areas - CM REVANTH VISIT FLOOD AFFECT AREAS
Published : Sep 3, 2024, 12:56 PM IST
|Updated : Sep 3, 2024, 2:43 PM IST
CM Revanth Reddy Visit Flood Affected Areas in Mahabubabad : భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితుల సమస్యలు తెలుసుకున్నారు. వరదల్లో చిక్కుకున్న వారికి ప్రత్యేక ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తక్షణ సాయంగా రూ.10 వేలును ఇవ్వనుంది. అలాగే వరదల్లో మరణించిన వారికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం, అలాగే పాడి పశువులు కోల్పోయిన వారికి రూ.50 వేలు, మేకలు, గొర్రెలు కోల్పోయిన వారికి రూ.5 వేలు ఆర్థిక సాయాన్ని సీఎం ప్రకటించారు. నేడు ఖమ్మం జిల్లా గంగారం తండాలో సీఎం రేవంత్ పర్యటించిన సీఎం, అనంతరం మహబూబాబాద్‌కు వెళ్లారు. అక్కడ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అక్కడే ఉన్న సీతారాం నాయక్ తండాకు వెళ్లారు. మహబూబాబాద్ కలెక్టరేట్లో వరదలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.
Last Updated : Sep 3, 2024, 2:43 PM IST