![](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-01-2025/640-480-23419937-thumbnail-16x9-revanth.jpg)
LIVE : సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - CM REVANTH REDDY PRESSMEET LIVE
![ETV Bharat Telangana Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jan 28, 2025, 3:32 PM IST
|Updated : Jan 28, 2025, 4:24 PM IST
Revanth Reddy on Govt Schemes : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రులతో కలిసి ఆయన వివిధ ప్రభుత్వ పథకాల అమలు, పరిపాలన అంశాలపై మాట్లాడుతున్నారు. జనవరి 26న 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం నాలుగు పథకాలను ప్రారంభించారు. అందులో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలు ఉన్నాయి. ఈ పథకాల అమలుకు ముందుగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని తీసుకుని అధికారులు ఈ నాలుగు పథకాలను లబ్దిదారులకు అందజేశారు. ఈ పథకాలను ఆయా నియోజక వర్గాల్లోని ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని ప్రారంభించారు. రైతు భరోసా నిధులు నిన్నటి నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. మార్చి వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. కొత్త రేషన్ కార్డుల జారీ కూడా మొదలైంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
Last Updated : Jan 28, 2025, 4:24 PM IST