LIVE : చిలుకూరులోని గురుకుల పాఠశాలను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి - CM REVANTH REDDY LIVE
Published : Dec 14, 2024, 12:55 PM IST
|Updated : Dec 14, 2024, 1:51 PM IST
CM Revanth in Gurukul school Live : రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి గురుకులాల బాట పట్టింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు సహా కీలక యంత్రాంగం గురుకులాలను సందర్శిస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి మధ్యాహ్నం 12.30కు చిల్కూర్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చేరుకుని సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో కామన్ డైట్ ప్లాన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో పరిస్థితులను స్వయంగా పరిశీలించి, అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన విద్యార్థుల సంక్షేమం, గురుకులాల అభివృద్ధికి ప్రణాళికలు చేయనున్నారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ, జనరల్ గురుకులాలన్నీ కలిపి సుమారు 1000 వరకు ఉన్నాయి. గురుకులాల్లో కలుషిత ఆహారంతో విద్యార్థుల అస్వస్థత వంటి ఘటనలు చోటు చేసుకోవడంతో తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం, పరిస్థితులను చక్కదిద్దేందుకు సన్నద్ధమైంది. ఈ మేరకు ఇవాళ చిల్కూర్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సీఎం రేవంత్ సందర్శించారు. చిల్కూర్ నుంచి ప్రత్యక్షప్రసారం ద్వారా చూద్దాం.
Last Updated : Dec 14, 2024, 1:51 PM IST