తెలంగాణ

telangana

ETV Bharat / videos

జంట నగరాల్లో కాంగ్రెస్‌ చేసిన అభివృద్ధిని చూపి బీఆర్‌ఎస్‌ దోచుకుంది : సీఎం రేవంత్ - Revanth Road Show in Secunderabad - REVANTH ROAD SHOW IN SECUNDERABAD

By ETV Bharat Telangana Team

Published : May 4, 2024, 10:29 PM IST

CM Revanth Reddy Road Show in Secunderabad : ఈ హైదరాబాద్‌ నగరానికి కృష్ణా నది జలాలు వచ్చాయంటే పీజేఆర్‌ పోరాటం, వైఎస్సాఆర్‌ నిర్ణయం వల్లేనని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. మెట్రో రైలును తీసుకువచ్చిందే కాంగ్రెస్‌. హైదరాబాద్‌ అభివృద్ధి కాంగ్రెస్‌ హయాంతోనే జరిగిందని, ఐటీ, పరిశ్రమలు కూడా కాంగ్రెస్‌నే తీసుకువచ్చిందన్నారు. శిల్పారామం వద్ద కేటీఆర్‌ సెల్ఫీ తీసుకుని సెల్ఫ్‌ డబ్బా కొట్టుకుంటున్నారు ఆ శిల్పారామం కట్టిందే కాంగ్రెస్‌నని అన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చింది కాంగ్రెస్‌తోనే. 

కానీ కాంగ్రెస్‌ చేసిన అభివృద్ధి చూపి బీఆర్‌ఎస్‌ దోచుకుంది. దురదృష్టంకొద్ది జంటనగరాల్లో ఎక్కడా కాంగ్రెస్‌ గెలవలేదన్నారు. కానీ పార్లమెంటు అభ్యర్థిని గెలిపించండని కోరారు. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తుంది దానం నాగేందర్‌ను కేంద్రమంత్రిగా ప్రమాణం చేయించే బాధ్యత తాను తీసుకుంటానని సీఎం రేవంత్‌ హామీ ఇచ్చారు. కిషన్‌రెడ్డి కేంద్రమంత్రి అయి ఏం చేశాడని, ఐదు రూపాయలు కూడా జంట నగరాలకు తేలేదని ఎద్దేవా చేశారు. జంట నగరాలు అభివృద్ధి జరగాలంటే దానం నాగేందర్‌ గెలవాలన్నారు. అనంతరం ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గం పరిధిలో జరిగిన కాంగ్రెస్‌ రోడ్‌ షోలో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details