తెలంగాణ

telangana

ETV Bharat / videos

మా నాయకుడి ఇంటికొస్తామని ఛాలెంజ్ చేస్తే మావాళ్లే వెళ్లి వాళ్ల పనిపట్టారు : సీఎం రేవంత్ - CM COMMENTS ON KAUSHIK REDDY ISSUE - CM COMMENTS ON KAUSHIK REDDY ISSUE

🎬 Watch Now: Feature Video

By ETV Bharat Telangana Team

Published : Sep 15, 2024, 7:56 PM IST

CM Revanth Reddy Comments On Kaushik Reddy Issue : కాంగ్రెస్‌ కార్యకర్తల జోలికి ఎవరైనా వస్తే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. అరెకపూడిగాంధీ, కౌశిక్‌రెడ్డి వ్యవహారంపై పరోక్షంగా రేవంత్‌ స్పందించారు. తమ పార్టీ నేత ఇంటికి వస్తామని బెదిరిస్తే తమ వారే వెళ్లి ప్రతిపక్ష నేతల పనిపట్టారని సంచలన కామెంట్స్ చేశారు. టీపీసీసీ చీఫ్​గా మహేశ్‌కుమార్‌గౌడ్‌ బాధ్యతలు చేపట్టిన కార్యక్రమంలో పాల్గొని రేవంత్ మాట్లాడారు. 

ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ సౌమ్యుడు అని ఎవరైనా తోకజాడిస్తే ఆయన వెనుక తానున్నానని స్పష్టం చేశారు. కులగణన చేపట్టి జనాభా ప్రకారం న్యాయం చేయాలనేది రాహుల్‌ గాంధీ ఆశయమని కులగణన కోసమే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఆలస్యమైందని తెలిపారు. వ్యవసాయ రుణం రూ.2 లక్షలకు పైగా ఉన్న రైతులు భయపడొద్దని, అందరికి న్యాయం చేస్తామని వెల్లడించారు. రుణమాఫీ చేస్తే రాజీనామాకు సిద్ధమన్న హరీశ్‌రావు సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి సవాల్‌ విసిరారు.

ABOUT THE AUTHOR

...view details