LIVE : మల్లేపల్లిలో ఐటీఐ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ - ITI Skill Development Live - ITI SKILL DEVELOPMENT LIVE
Published : Jun 18, 2024, 3:00 PM IST
|Updated : Jun 18, 2024, 3:33 PM IST
CM Revanth Reddy Bhumi Puja for ITI Skill Development Project Live : రాష్ట్రంలోని ఐటీఐ కాలేజీలను అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగులేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 65 ప్రభుత్వ ఐటీఐ కాలేజీల్లో స్కిల్లింగ్ సెంటర్ల ఏర్పాటుకు టాటా టెక్నాలజీస్‌తో ఎంవోయూ కుదుర్చుకుంది. యువతకు ఉపాధి అవకాశాలను అందించే కోర్సులు అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.2700 కోట్ల ఖర్చుతో ఐటీఐలలో ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది. అవసరమైన వర్కషాప్ల నిర్మాణంతో పాటు యంత్రపరికరాల సామగ్రితో పాటు శిక్షణను అందించే ట్యూటర్ల నియామకాన్ని టాటా టెక్నాలజీస్ చేపడుతుంది. ప్రాజెక్టులో భాగంగా ఐటీఐలలో కొత్తగా 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులు ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో మల్లేపల్లిలో ఐటీఐ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు.
Last Updated : Jun 18, 2024, 3:33 PM IST