LIVE : మహబూబాబాద్ జనజాతర సభలో రేవంత్ రెడ్డి - ప్రత్యక్ష ప్రసారం - Congress Leaders Election Campaign - CONGRESS LEADERS ELECTION CAMPAIGN
Published : Apr 19, 2024, 5:21 PM IST
|Updated : Apr 19, 2024, 6:19 PM IST
CM Revanth Reddy At Mahabubabad Jana Jatara Sabha Live : లోక్‌సభ ఎన్నికల్లో రెండంకెల సీట్లను గెలిచి, విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి కాంగ్రెస్ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎంపీ అభ్యర్థుల నామినేషన్లకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వెళుతూ అందరిలో జోష్ నింపుతున్నారు. అనంతరం ఆయా నియోజకవర్గాల్లో సభ నిర్వహించి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా ఎన్టీఆర్ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన జాతర సభ పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.మహబూబాబాద్ నుంచి పార్టీ అభ్యర్థిగా పోరిక బలరాం నాయక్ నేడు నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా జనజాతర సభకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జిల్లాకు మొదటిసారిగా వచ్చారు. ఈ కారణంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సభను భారీ స్థాయిలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సభకు సీఎంతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు భరత్ చంద్రారెడ్డి, పార్టీ అభ్యర్థి బలరామ్ నాయక్, ఎమ్మెల్యే మురళి నాయక్‌లు హాజరయ్యారు.
Last Updated : Apr 19, 2024, 6:19 PM IST