తెలంగాణ

telangana

ETV Bharat / videos

సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి - REVANTH REDDY MEETs CJI - REVANTH REDDY MEETS CJI

By ETV Bharat Telangana Team

Published : Mar 28, 2024, 2:23 PM IST

CM Revanth Meets CJI Justice Chandrachud :  హైదరాబాద్‌లో పర్యటిస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కలిశారు. ఫలక్‌నుమాలో మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర హైకోర్టు నూతన భవన శంకుస్థాపన కార్యక్రమానికి సీజేఐ బుధవారం నగరానికి వచ్చారు. కానీ రేవంత్‌రెడ్డి దిల్లీ పర్యటన కారణంగా ఆయణ్ను కలవలేకపోయారు. ఈ క్రమంలోనే దిల్లీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన రేవంత్‌రెడ్డి ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ బస చేసిన ఫలక్‌నుమాకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. 

CJI Justice DY Chandrachud Telangana Visit :  రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​లో తెలంగాణ నూతన హైకోర్టు భవనానికి బుధవారం నాడు  సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్వర న్యాయం కావాలని యువభారతం ఆశిస్తోందని, సమాజంలోని అన్ని వర్గాలకు కోర్టులు చేరువ కావాలని ఆయన అన్నారు. కొత్త హైకోర్టు నిర్మాణం కోసం హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో ఉన్న వ్యవసాయ, ఉద్యానవన యూనివర్సిటీలోంచి 100 ఎకరాలను ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details