LIVE : సచివాలయంలో 'రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం' చెక్కుల పంపిణీ - CM Revanth Distribute Cheques - CM REVANTH DISTRIBUTE CHEQUES
Published : Aug 26, 2024, 4:28 PM IST
|Updated : Aug 26, 2024, 5:26 PM IST
CM Revanth Distribute Cheques Live : తెలంగాణ రాష్ట్రానికి చెందిన సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన యువతకు రాష్ట్ర ప్రభుత్వం 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం' పథకం కింద ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించిన వారికి సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి చెక్కులను అందజేస్తున్నారు. మెయిన్స్‌లో అర్హత సాధించేందుకు ప్రభుత్వం తరఫున సాయంపై వారితో రేవంత్ రెడ్డి చర్చించారు. యూపీఎస్సీలో రాష్ట్రం నుంచి ఎంపికయ్యే వారి సంఖ్య పెంచేలా ప్రభుత్వం కొత్త పథకం తీసుకొచ్చింది. ఈ పథకానికి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకమని నామకరణం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన యువత సివిల్స్‌లో మరిన్ని ర్యాంకులు సాధించి రాష్ట్ర కీర్తిని దేశవ్యాప్తంగా ఇనుమడింపచేయాలని కోరారు. సివిల్స్ సన్నద్ధమయ్యే యువతకు ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించిన వారికి సీఎం రేవంత్ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సమావేశానికి సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన వారు హాజరయ్యారు.
Last Updated : Aug 26, 2024, 5:26 PM IST