ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

15న కర్నూలు, గుంటూరు జిల్లాల్లో సీఎం జగన్​ పర్యటన - సీఎం జగన్​ కర్నూలు పర్యటన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 13, 2024, 5:46 PM IST

CM Jagan Kurnool Tour: ముఖ్యమంత్రి జగన్​ మోహన్ రెడ్డి ఈ నెల 15న కర్నూలు, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూలు జిల్లాలోని ఎమ్మెల్యే మనవడి వివాహ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అదే రోజు గుంటూరులో వాలంటీర్లు నిర్వహిస్తున్న అభినందన సభలో సైతం పాల్గొననున్నారు. ఈ నెల 15న కర్నూలు జిల్లాలో సీఎం జగన్​ పర్యటించనున్నారు. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కర్నూలుకు చేరుకుంటారు. కర్నూలు బళ్లారి రోడ్​లోని ఓ ఫంక్షన్​ హాల్​లో జరగనున్న ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి సీఎం హాజరు కానున్నారు. తిరిగి బయల్దేరి మధ్యాహ్నం వరకు తాడేపల్లికి చేరుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాలకు తాడేపల్లి నుంచి బయలుదేరి,  ఫిరంగిపురం మండలంలోని రేపూడిలో వాలంటీర్ల అభినందన సభలో (CM Jagan to Volunteers Meeting) ముఖ్యమంత్రి జగన్​ పాల్గొననున్నారు. ఆ సభలో పాల్గొన్న అనంతరం తిరిగి అక్కడి నుంచి బయల్దేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 

ABOUT THE AUTHOR

...view details