LIVE: కృష్ణా జిల్లాలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - CM CHANDRABABU PRESS MEET
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 20, 2024, 3:28 PM IST
|Updated : Dec 20, 2024, 3:55 PM IST
Live: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. గంగూరు, ఈడుపుగల్లు గ్రామాల్లో సీఎం పర్యటన కొనసాగుతోంది. గంగూరు రైతు సేవాకేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించి, సిబ్బంది, రైతులు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వెంకటాద్రి ధాన్యం మిల్లును సీఎం పరిశీలించారు. రైతులు పండించిన పంటకు మద్ధతు ధర లభిస్తుందా లేదా అనేది ముఖ్యమంత్రి స్వయం పరిశీలన చేశారు. గంగూరు, ఈడ్పుగల్లు గ్రామాలకు వెళ్లి రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. సిబ్బంది, రైతులు, అధికారులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తూకంలో హెచ్చుతగ్గులు, తేమశాతంలో లొసుగులు వంటి అంశాలను స్వయంగా తెలుసుకున్నారు. రైతుల నుంచి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. తేమశాతంలో ఎందుకు మార్పులు వస్తున్నాయంటూ అధికారులు, రైతుల నుంచి వివరణ తీసుకున్నారు. ఈడుపుగల్లులో రెవెన్యూ సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. లబ్దిదారులు, రైతులతో సీఎం ముఖాముఖి నిర్వహిస్తున్నారు. పీపీసీ కేంద్రంలోనూ రైతులతో సీఎం మాట్లాడనున్నారు. మీ కోసం ప్రత్యక్ష ప్రసారం
Last Updated : Dec 20, 2024, 3:55 PM IST