ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE దిల్లీ ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - CHANDRABABU ON DELHI RESULTS LIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2025, 4:28 PM IST

Updated : Feb 8, 2025, 5:11 PM IST

CM Chandrababu Press Meet on Delhi Results Live : దిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ- బీజేపీ ఘన విజయం సాధించింది. వరుసగా మూడుసార్లు గెలిచిన ఆప్​​ను గద్దె దించి 27 ఏళ్ల తర్వాత దిల్లీ కోటపై ఎగిరిన కాషాయజెండా ఎగురవేసింది. 70 అసెంబ్లీ నియోజకవర్గాలున్న దిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్​ ఫిగర్​ను సునాయాసంగా దాటింది. బీజేపీ దెబ్బకు ఆప్​ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​ సహా ఆ పార్టీ అగ్రనేతలు ఓటమి పాలయ్యారు. ఆప్‌ కంచుకోటలను బీజేపీ అభ్యర్థులు బద్దలుకొట్టారు. గత ఎన్నికల్లో 62 సీట్లు గెలిచిన ఆప్​ ఈసారి ప్రభావం చూపలేకపోయింది. కాంగ్రెస్ ఈసారీ​ ఖాతా తెరవలేదు.సుదీర్ఘ కాలం పాటు దేశ రాజధానిలో అధికారం లేకుండా ఉన్న బీజేపీ ఈ సారి ఎలాగైనా గెలవాల్సిందేనని పక్కా ప్రణాళిక రూపొందించుకుంది. ఏ ఒక్క అవకాశాన్నీ వదులు కోలేదు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచార వ్యూహాల వరకు బీజేపీ అధిష్ఠానం పక్కాగా పర్యవేక్షించింది. అయితే దిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు సైతం పాల్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా చంద్రబాబు ఉండవల్లిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రత్యక్షప్రసారం మీకోసం.  
Last Updated : Feb 8, 2025, 5:11 PM IST

ABOUT THE AUTHOR

...view details