LIVE: కాకినాడ జిల్లా రాజుపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటన - ప్రత్యక్షప్రసారం - Chandrababu Public Meeting LIVE - CHANDRABABU PUBLIC MEETING LIVE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 11, 2024, 3:14 PM IST
|Updated : Sep 11, 2024, 4:12 PM IST
CM Chandrababu Naidu held Meeting with Rajupalem Villagers : కాకినాడ జిల్లాలో రాజుపాలెం గ్రామాన్ని పరిశీలించిన అనంతరం గ్రామస్థులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. వారితో వరద ప్రభావంపై ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు గోదావరి జిల్లాల పర్యటన చేస్తున్నారు. ముందుగా ఏలూరు జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. కొల్లేరు పరివాహక ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. రోడ్డు మార్గంలో తమ్మిలేరు వరద ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరదలపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో ఎకరాకు రూ.10 వేలు పరిహారం చెల్లించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. గతంలో బుడమేరుకు గండ్లు పడితే వైసీపీ ప్రభుత్వం పూడ్చలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. వైసీపీ పాలనలో బుడమేరును ఆక్రమణలకు గురి చేశారన్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి అక్రమ కట్టడాలకు అనుమతులిచ్చారని విమర్శించారు. తప్పుడు బిల్లులతో డబ్బును కాజేశారన్నారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలే ఎక్కువ నష్టపోతారని తెలిపారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే విజయవాడ అతలాకుతలమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. గతంలో బుడమేరుకు గండ్ల పడితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూడ్చలేదని విమర్శించారు. ప్రస్తుతం కాకినాడ జిల్లా రాజుపాలెం గ్రామస్థులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Sep 11, 2024, 4:12 PM IST