LIVE: : రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్లో సీఎం చంద్రబాబు ప్రసంగం - ప్రత్యక్ష ప్రసారం - CM Chandrababu Gujarat Tour - CM CHANDRABABU GUJARAT TOUR
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 16, 2024, 4:38 PM IST
|Updated : Sep 16, 2024, 4:54 PM IST
CM Chandrababu Gujarat Tour : ముఖ్యమంత్రి చంద్రబాబు గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లో జరిగే 4వ గ్లోబల్ రెన్యుబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్, ఎక్స్‌పో (Re-Invest 2024) సదస్సులో ఆయన పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగే సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్‌ధన్‌కర్ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్తాన్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఈ సదస్సులో రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, అధికారులు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ (Global Renewable Energy Investors Meet)లో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒక భారత్ వాసి ఉంటున్నారని, ప్రతి నలుగురు భారత్ ఐటీ నిపుణుల్లో ఒక తెలుగు రాష్ట్రాల వాసి ఉంటున్నారని చంద్రబాబు అన్నారు. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయని, ఆర్థిక సంస్కరణలకు ముందు వృద్ధిరేటు సాధారణంగా ఉండేదని, గతంలో ఐటీ ప్రవేశపెట్టినప్పుడు విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్లో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు, ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Sep 16, 2024, 4:54 PM IST