ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కారుపైకి కేకు విసిరిన యువకులు - ప్రశ్నించినందుకు ఘర్షణ - CLASHES BETWEEN TWO GROUPS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 11, 2024, 12:11 PM IST

Clashes Between Two Groups in Malapadu Village : వైఎస్సార్​ జిల్లా ఎర్రగుంట్ల మండలం మాలపాడు గ్రామంలో బుధవారం జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. స్థానికుల వివరాల ప్రకారం పోట్లదుర్తి పంచాయతీ పరిధిలోని రామాంజనేయపురం గ్రామానికి చెందిన వ్యక్తులు ఓ కారులో మాలపాడు గ్రామం మీదుగా వెళ్తుంటే కొందరు కేకు కోసి సంబరాలు చేసుకుంటూ కారుపైకి విసిరినట్లు తెలిపారు. 

ఈ నేపథ్యంలో వాహనంలోని వారు కేకు విసిరిన వారిని ప్రశ్నించారు. మాటమాట పెరిగి ఒకరిని ఒకరు కొట్టుకునే వరకు వెళ్లిందని స్థానికులు తెలిపారు. ఈ ఘర్షణలో ఒకరికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘర్షణ పడుతున్న ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. ఈ సంఘటనపై ఇరు వర్గాల వారు కలమల్ల పోలీస్​ స్టేషన్​ల్లో ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details