వల్లూరులో ఉద్రిక్త వాతావరణం - జనసేన నేత వేగుళ్ల లీలా కృష్ణ అరెస్టు - Vegulla leela Krishna Arrest - VEGULLA LEELA KRISHNA ARREST
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 14, 2024, 4:20 PM IST
Clashes Between TDP And YCP Leaders : కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సోమవారం రాత్రి తెలుగుదేశం, వైసీపీ నాయకుల మధ్య జరిగిన రాళ్ల దాడి ఘటనపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు మండపేట జనసేన పార్టీ ఇన్‌ఛార్జి వేగుళ్ల లీలా కృష్ణను పోలీసుల అరెస్ట్ చేసి పామర్రు స్టేషన్‌కు తరలించారు. దీంతో గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది.
Janasena Leader Vegulla leela Krishna Arrest: విషయం తెలుసుకున్న మండపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పరిశీలించారు. పోలీసులు లీలా కృష్ణపై కేసు నమోదు చేశారు. లీలా కృష్ణను ప్రత్యేక వాహనంలో ఆలమూరు కోర్టుకు పోలీసులు తరలించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసినా కొన్ని చోట్ల ఉద్రికత్త వాతావరణం నెలకొంది. వైఎస్సార్సీపీ నేతలు రాళ్లు, కర్రలతో ప్రతిపక్ష నేతలు, ఓటర్లపై దాడులకు తెగబడ్డారు. ఓటమి భయంతోనే అధికార పార్టీ నేతలు దాడులకు తెగబడుతున్నారని టీడీపీ, జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.