ఇరు పార్టీల కౌన్సిలర్ల ఘర్షణ- మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు వాయిదా - Clash Between TDP vs YCP Councilors
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 28, 2024, 4:39 PM IST
Clash Between TDP And YSRCP Councilors : అనంతపురం జిల్లా గుంతకల్ మున్సిపాలిటీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నిర్వహణకు టీడీపీ, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం నిర్వహించిన తర్వాత వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఓటింగ్‌కు నిరాకరించి బయటకు వెళ్లిపోయారు. దీంతో మున్సిపల్ కమిషనర్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలను వాయిదా వేశారు. సంఖ్యా బలం ఉన్నా ఓటింగ్ ఎందుకు జరపలేదని టీడీపీ కౌన్సిలర్లు కమిషనర్‌ను నిలదీశారు. రెండు పార్టీల కౌన్సిలర్లు మధ్య ఘర్షణ తలెత్తడంతో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కమిషనర్ ప్రకటించారు. టీడీపీ కౌన్సిలర్లు కృష్ణారెడ్డి పేరును, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు గోపాలకృష్ణ పేరును ప్రతిపాదించారు.
Municipality Standing Committee Election Postponed : వాయిదాపై పలువురు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిలర్ల సమావేశంలో మాటల యుద్దం వల్ల ఇలా జరిగిందని సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు టీడీపీలో చేరుతూ పార్టీ అధిష్ఠానానికి షాక్ ఇస్తున్నారు.