ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక బురదచల్లే ప్రయత్నం: చింతమనేని - Chinchamaneni Fire on YCP Leaders - CHINCHAMANENI FIRE ON YCP LEADERS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 27, 2024, 4:30 PM IST

Chintamaneni Prabhakar Fire on YCP Leaders: రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక వైఎస్సార్సీపీ నాయకులు నిత్యం తనపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తనకు ఓటు వేయను అన్న వ్యక్తిపై తాను దాడి చేశానని వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ప్రజాస్వామ్యంలో నచ్చిన వ్యక్తికి ఓటు వేసే హక్కు ప్రజలకు ఉందని అంత మాత్రాన వారిపై దాడికి ఎందుకు పాల్పడతామంటూ చింతమనేని ప్రశ్నించారు. 

ప్రజల్లో తనకు వస్తున్న ఆదరణ చూసి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో కూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన దెందులూరులో భారీ మెజార్టీతో గెలవబోతున్నట్లు వెల్లడించారు. వైఎస్సార్సీపీ నాయకులు అంతా సర్దుకునే రోజు దగ్గర్లోనే ఉందని ఎవ్వరినీ వదలమని చింతమనేని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details