ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యే శరణ్యం - మిరప రైతుల ఆవేదన - farmers Protest

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 13, 2024, 2:29 PM IST

Chili farmers Protest in Anantapur District : అనంతపురం జిల్లాలో ఏటికేడు మిరప సాగు పెరుగుతోన్నా ధరలు మాత్రం నానాటికీ తగ్గిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. హంద్రీనీవా కాలువల కింద రూ. 1.20 లక్షల ఎకరాల్లో మిరప సాగైంది. ఒక్కో రైతు ఎకరానికి దాదాపు రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టినా కనీస దిగుబడి రాలేదని రైతులు వాపోతున్నారు. ఎన్నడూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదని కౌలు రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

ధరలు పడిపోయి రోడ్డెక్కుతున్నా ప్రభుత్వం తము పట్టించుకోలేదని మిరప రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా నష్టపోతున్నా వైసీపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదన్నారు. విత్తనం నుంచి విక్రయం దాకా ప్రభుత్వమే చూసుకుంటుందని ప్రగల్భాలు పలికే సీఎం జగన్​ మోహన్​ రెడ్డి రైతులకు కష్టం వచ్చినప్పుడు మొద్దు నిద్రపోతున్నారని కర్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేతికి వచ్చిన పంటను పొలంలో నిల్వ ఉంచుకుని గిట్టుబాటు ధర కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వమే తక్షణమే ఆదుకోవాలని లేకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని మిరప రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details