LIVE: పెదకూరపాడు 'ప్రజాగళం' సభలో చంద్రబాబు - ప్రత్యక్ష ప్రసారం - CHANDRABABU PRAJA GALAM LIVE - CHANDRABABU PRAJA GALAM LIVE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 6, 2024, 5:29 PM IST
|Updated : Apr 6, 2024, 7:08 PM IST
Chandrababu Praja Galam Live : ప్రజాగళం రెండో విడతలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నారు. నేడు పల్నాడు జిల్లాలోని నేడు పెదకూరపాడు, సత్తెనపల్లిలో నిర్వహించే ప్రజాగళం సభల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. పెదకూరపాడు ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగిస్తున్నారు.'గోదావరిలో ఇసుక ఉంటుంది. పక్కనే ఉన్న పాలకొల్లులో ఇసుక దొరకట్లేదు. ఇసుక మాఫియాకి సీఎం జగన్ నాయకుడు. ఇసుక విధానాన్ని ఇష్టారాజ్యంగా చేసి భవన నిర్మాణ కార్మికులను సర్వనాశనం చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే ఇసుక ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నా' అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ హయాంలో ట్రాక్టర్ ఇసుక రూ.1000కి ఇస్తే వైఎస్సార్సీపీ రూ.5వేలు చేసిందని, మిగిలిన రూ.4వేలు ఎవరి జేబులోకి వెళుతున్నాయని ప్రశ్నించారు. వైసీపీ దుర్మార్గపు ఇసుక విధానం వల్ల వేలమంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో 160కి పైగా అసెంబ్లీ, 24 లోక్‌సభ స్థానాలకు తగ్గకుండా ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు పట్టణాల్లో శుక్రవారం ప్రజాగళం రోడ్‌షో, బహిరంగ సభలు నిర్వహించారు. రెండు సభల్లో చంద్రబాబు ప్రసంగించారు.
Last Updated : Apr 6, 2024, 7:08 PM IST