మరో సారి ఉమ్మడి ప్రచారం చేయనున్న చంద్రబాబు, పవన్ - కార్యకర్తల్లో ఫుల్ జోష్ - CBN Pawan Election Campaigning - CBN PAWAN ELECTION CAMPAIGNING
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 12, 2024, 9:36 PM IST
Chandrababu Pawan Kalyan Election Campaigning : తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ తొలిదశ ఉమ్మడి ప్రచారం సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. వైసీపీ రాక్షస పాలన నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడేందుకు ఇరువురు నేతలు కలిసి ప్రజలను చైతన్య పరుస్తున్నారు. ఇందులో భాగంగానే ఇద్దరు నేతల తొలివిడత ప్రచారంతో కార్యకర్తల్లో ఫుల్ జోష్ వచ్చింది. ఇక ఇదే జోష్తో మలి విడత పర్యటన ఖరారు అయ్యింది. ఈ నెల 16, 17వ తేదీల్లో ఇరువురు నేతలు కలిసి మరో సారి ఉమ్మడి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రచారం చేసి ప్రజలను చైతన్య పరుస్తారు. 16వ తేదీన విజయనగరరం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో ఉమ్మడిగా రోడ్ షో నిర్వహిస్తారు. అనంతకం సభలో పాల్గొంటారు. అదేవిధంగా 17వ తేదీన పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో ప్రజాగళం ఉమ్మడి సభలు నిర్వహించనున్నారు.
రేపు (శనివారం) తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రజాగళం నిర్వహించనున్నారు. 14వ తేదీన పాయకరావుపేట, చోడవరం, గాజువాక, అలాగే 15వ తేదీన రాజాం, పలాస, టెక్కలిలో ప్రజాగళం సభ నిర్వహించనున్నారు. ఈరోజు జరిగే వేమూరు, రేపల్లె పర్యటనలతో కలిపి ఇప్పటి వరకు 31 నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రజాగళం సభలు పూర్తి చేసుకోన్నారు.