ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: రాజాం ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రత్యక్షప్రసారం - Chandrababu NaiduPrajagalam Live - CHANDRABABU NAIDUPRAJAGALAM LIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 15, 2024, 4:33 PM IST

Updated : Apr 15, 2024, 5:27 PM IST

Chandrababu Naidu Rajam Prajagalam Live: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రజాగళం సభలు జోరుగా సాగుతున్నాయి. నిన్న జరిగిన పాయకరావుపేట ప్రజాగళం సభలో చంద్రబాబు వరాలు కురిపించారు. "పేదోడినని చెప్పుకొనే ఈ ముఖ్యమంత్రి తొమ్మిదిసార్లు విద్యుత్‌ ఛార్జీలు, 3 సార్లు బస్సు ఛార్జీలు పెంచారు. జగన్‌ తెచ్చిన ప్రతి పథకం వెనుక పెద్ద కుంభకోణం ఉంది. కుంభకోణాలకు పాల్పడిన వారిని ఉక్కు పాదంతో తొక్కాలి. ఆకాశమే హద్దుగా ఏపీని అభివృద్ధి చేసే మేనిఫెస్టో తెచ్చాం. ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఖాతాల్లో వేస్తాం. తల్లికి వందనం కార్యక్రమం కింద ఏడాదికి రూ.15వేల చొప్పున, ఏప్రిల్‌ నుంచి వృద్ధాప్య, వితంతు పింఛన్లు రూ.4వేలు చొప్పున ఇస్తాం. కూటమి అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యతమీదని, యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాదని చంద్రబాబు ప్రకటించారు". విశాఖపట్నంను ఐటీ కేంద్రంగా చేయాలని చూస్తే జగన్‌ వచ్చి గంజాయి కేంద్రంగా మార్చారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాజాం 'ప్రజాగళం' సభలో చంద్రబాబు ప్రసంగిస్తున్న ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Apr 15, 2024, 5:27 PM IST

ABOUT THE AUTHOR

...view details