ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మద్యపానం నిషేధం చేయని నువ్వు ఏ మొఖంతో ఓట్లు అడుగుతావు జగన్‌: చంద్రబాబు - Chandrababu on Jagan - CHANDRABABU ON JAGAN

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 27, 2024, 1:10 PM IST

Chandrababu Fire on CM Jagan not Banning Alcohol: మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్న జగన్ వాటిల్లో ఏ ఒక్కదాని మీదన్నా గౌరవం ఉంటే 2019 వైసీపీ మేనిఫెస్టోలో చెప్పినట్టు మద్యపాన నిషేధం చేసి ఉండేవారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ద్వజమెత్తారు. మద్యాన్ని నిషేధించాకే ఓటు అడుగుతానన్న జగన్ ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని 2024 మేనిఫెస్టోని విడుదల చేసి, ఓట్లు అడుగుతావని నిలదీశారు. మేనిఫెస్టోపై జగన్ వీడియోను చంద్రబాబు తన ఎక్స్‌ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్‌ చేశారు.

Liquor Brands in AP : మద్యపానం ఆరోగ్యానికి హానికరం ఇది ఎప్పట్నుంచో వింటున్న హెచ్చరికే మరి మద్యపానం ప్రాణాంతకం అనే హెచ్చరిక ఎప్పుడైనా విన్నారా? ఏపీలో మద్యం తాగిన వారెవరైనా చెప్పే మాటిదే. ఏపీ మద్యాన్నైనా వదిలేయాలి లేదంటే ప్రాణాల మీదైనా ఆశలు వదులుకోవాలి. ఎందుకంటే ఆంధ్రలో జనం కోరిన బ్రాండ్లు కాదు, జగన్‌ ఇచ్చిన బ్రాండ్లే దిక్కు. రంగుల రసాయనాల్ని తలపించే మద్యంతో కాలేయాలు చెడిపోయి, నాలుకలు ఎండిపోయి, కాళ్లు, చేతులు చచ్చుబడిపోయి, కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి! J-బ్రాండ్లతో పాలకులు డబ్బు పోగేసుకుంటుంటే పేదిళ్లలో చావుడప్పులు మోగుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details