చైతన్యపురిలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్ - వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ - Chain snatching At Chaitanyapuri - CHAIN SNATCHING AT CHAITANYAPURI
Published : Oct 1, 2024, 11:10 AM IST
Chain snatching At Chaitanyapuri : హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దొంగ రెచ్చిపోయాడు. అలకాపురి రోడ్ నెంబర్ 8లో వృద్ధురాలి మెడలోనుంచి మూడు తులాల బంగారు గొలుసును కాజేశాడు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం అలకాపురి ప్రాంతంలో లక్ష్మీ సుజాత(65) అనే వృద్ధురాలు నివాసముంటుంది. నిత్యావసరాలు కొనేందుకని కిరాణషాప్నకు వెళ్లి తిరిగి వస్తుండగా ఓ గుర్తుతెలియని చైన్‌స్నాచర్ ఆమె మెడలో నుంచి 2.50 లక్షల విలువైన బంగారు గొలుసును కొట్టేశాడు. మహిళ ఆ షాక్‌నుంచి తేరుకునేంతలోపే అక్కడి నుంచి ఉడాయించాడు. అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఘటనా స్థలాన్ని ఎల్బీనగర్ ఏసీపీ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. మహిళలు ఒంటరిగా బయటకు వెళ్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.