కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు - క్షణాల్లో పూర్తిగా దగ్ధమైన వాహనం - Short circuit in car at panjagutta
Published : Feb 14, 2024, 10:48 PM IST
Car Fire Accident at Panjagutta : హైదరాబాద్లో వాహనాల్లో వరుస అగ్ని ప్రమాదాలు(Fire Accidents) ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. దీంతో ఖైరతాబాద్- పంజాగుట్ట దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ స్తంభించింది. రోడ్డుపై వెళ్తున్న కారులో అకస్మాత్తుగా బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో డ్రైవర్ కారును రోడ్డు పక్కన నిలిపివేశాడు.
Car Catches fire on Road at panjagutta : సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేసింది. ఆగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కారులో మంటలు చెలరేగడంతో పాదచారులు భయంతో పరుగులు పెట్టారు. డ్రైవర్ సికిందర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతుండటం వాహనదారులను భయాందోళనకు గురి చేస్తోంది.