పాడుబడ్డ బావిలోకి దూసుకెళ్లిన కారు - ఇద్దరు వ్యాపారులు మృతి - బావిలో పడిన కారు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 1, 2024, 1:32 PM IST
|Updated : Feb 1, 2024, 5:54 PM IST
Car Falls into A Well Two Dead in Kadapa District : కడప జిల్లా లింగాల మండలం ఇప్పట్ల వద్ద ప్రమాదవశాత్తు కారు బావిలో పడింది. అనంతపురం జిల్లా నుంచి పులివెందులకు బుధవారం రాత్రి బయలుదేరిన కారు మార్గ మధ్యంలోని లింగాల మండలం ఇప్పట్ల వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలోకి పడిపోయింది. కారులో మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి, ఢిల్లీకి చెందిన మరో వ్యక్తి ఉన్నారు. వీరిద్దరూ పులివెందుల నియోజకవర్గంలో అరటిపండ్లను కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ వ్యాపారం కొనసాగించే వారిని స్థానికులు చెబుతున్నారు.
మహారాష్ట్ర కు చెందిన ప్రకాష్ ఠాగూర్ ఢిల్లీకి చెందిన సునీల్ కేల్వాని అనే ఇరువురు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. కారు ప్రమాదానికి గురైందన్న సమాచారం అందిన వెంటనే పోలీసులు బావిలో పడ్డ కారును బయటకు తీయడం కోసం పెద్ద క్రేన్లను తెప్పించి దాదాపు మూడు గంటల పాటు శ్రమించారు. చివరికి కారును బయటకు తీసి ఇరువురి మృతదేహాలను పోస్టుమార్టమ్‌కు తరలించారు.