ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

విశాఖలో ప్రారంభమైన క్రిస్మస్‌ సందడి- డాల్ఫిన్ హోటల్లో ఘనంగా కేక్‌ మిక్సింగ్ - CAKE MIXING EVENT IN VIZAG

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 3, 2024, 3:47 PM IST

Cake Mixing Event was held Grandly at Dolphin Hotel in Visakha : విశాఖలోని డాల్ఫిన్ హోటల్​లో కేక్ మిక్సింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఏటా క్రిస్మస్ కి ముందు డాల్ఫిన్ సిబ్బంది, నిర్వహణ అధికారులు పండుగ వాతావరణంలో ఈ కేక్ మిక్సింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సిబ్బంది మొత్తం ఉల్లాసంగా 'మేరీ క్రిస్మస్' అంటూ రకరకాల డ్రై ఫ్రూట్స్, నాణ్యమైన వైన్ కలుపుతూ కేక్ మిశ్రమాన్ని తయారు చేశారు. ఈ సందర్భంగా క్రిస్మస్ తాత టోపీలను ధరించి మేరీ క్రిస్మస్ హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. అచ్చం క్రిస్మస్ పండుగ వాతావరణం తలపించేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఏటా క్రిస్మస్ కి ముందు ఈ కేకును మిక్స్ చేసి క్రిస్మస్ సమయంలో ప్లమ్ కేక్ తయారు చేస్తారు. దాదాపు 250 రకాల డ్రై ఫ్రూట్స్, వివిధ రకాలైన మిశ్రమాల్ని కలిపి కేక్ తయారు చేశారు. క్రిస్మస్ సమయంలో శుభాకాంక్షలు చెబుతూ ఈ కేక్ ను డాల్ఫిన్ హోటల్ అతిథులకు బహుమతిగా అందజేస్తారు. ప్రతి సంవత్సరం ఈ క్రిస్మస్ కేక్ మిక్స్ కార్యక్రమం చేయడం ఎంతగానో ఆనందాన్ని ఇస్తోందని డాల్ఫిన్ హోటల్ సిబ్బంది తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details