ఎమ్మెల్సీలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక - MLCs Unanimously Elected - MLCS UNANIMOUSLY ELECTED
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 5, 2024, 10:15 PM IST
C. Ramachandraiah and P. Hariprasad were Unanimously Elected as MLCs: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా సీ. రామచంద్రయ్య, పీ. హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఇద్దరి నుంచి మాత్రమే నామినేషన్లు రాగా వాటి ఉపసంహరణకు గడువు పూర్తి కావడంతో ఎన్నిక ఏకగ్రీవమైందని రిటర్నింగ్ అధికారి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా ఉన్న సీ.రామచంద్రయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్ వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. వారిలో ఇక్బాల్ ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేయగా, రామచంద్రయ్యపై అనర్హత వేటు పడింది.
దాంతో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ప్రస్తుతం ఉప ఎన్నికలు జరగగా, ఎలాంటి ఎన్నిక లేకుండానే ఏకగ్రీవమయ్యాయి. టీడీపీ సీనియర్ నేత సీ.రామచంద్రయ్యకు ఎన్టీఏ కూటమి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. మరో స్థానాన్ని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు రాజకీయ కార్యదర్శిగా ఉన్న పీ.హరిప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. శాసనసభలో ఎన్‌డీఏ కూటమికి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా ఎమ్మెల్సీలుగా వారిద్దరి ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తయింది.