తెలంగాణ

telangana

LIVE : ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డి నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్ - BRS Leader KTR Press Meet Live

By ETV Bharat Telangana Team

Published : Sep 14, 2024, 11:27 AM IST

Updated : Sep 14, 2024, 11:42 AM IST

KTR Visited MLA Padi Kaushik Reddy LIVE (ETV Bharat)
KTR Visited MLA Padi Kaushik Reddy LIVE : రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్​ నేతల మధ్య మాటల యుద్ధం పీక్‌ స్టేజ్‌కు చేరుకుంటోంది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మద్దతుదారులు, హుజూరాబాద్​ శాసనసభ్యుడు కౌశిక్‌ రెడ్డి ఇంటికి వెళ్లి దాడులకు పాల్పడటంతో ఇటీవల ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడిని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. ఇదే అంశంపై తాజాగా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న కేటీఆర్‌, రాష్ట్రంలో ప్రతిపక్షాలపై అధికార పక్షం చేస్తోన్న దాడులపై తీవ్రంగా స్పందిస్తున్నారు. పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నామా? ఎటు పోతోంది మన రాష్ట్రం? ఫ్యాక్షన్, రౌడీ రాజకీయాలకు తెలంగాణను అడ్డాగా మార్చేస్తుంటే బాధేస్తోందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కౌశిక్​ రెడ్డిని గృహ నిర్భందంలో ఉంచి అరికెపూడి గాంధీ గూండాలతో దాడి చేయిస్తారా? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఎమ్మెల్యేకు కూడా రక్షణ లేకపోవటమేనా? అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై న్యాయపరంగా పోరాడుతున్నందునే కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేశారని ఆక్షేపించారు. 
Last Updated : Sep 14, 2024, 11:42 AM IST

ABOUT THE AUTHOR

...view details