అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి మాకు ఆహ్వానం అందలేదు : ఎమ్మెల్సీ కవిత - Kavitha Meet Speaker For Statue
Published : Jan 21, 2024, 3:56 PM IST
BRS MLC Kavitha meets Assembly Speaker : అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మ జ్యోతిబా ఫులే విగ్రహాన్ని ప్రతిష్టించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోరారు. ఈ మేరకు ఆమె హైదర్‌గూడలోని న్యూ ఎమ్మెల్యే నివాస ప్రాంగణంలోని శాసనసభాపతి నివాసంలో స్పీకర్ గడ్డం ప్రసాదరావును కలిసి, భారత జాగృతి తరపున వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఏప్రిల్ 11వ తేదీలోపు ప్రభుత్వం ఈ విషయంపై మంచి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని కవిత పేర్కొన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
MLC Kavitha Demand to Install Pule Statue : గతంలో భారత జాగృతి పోరాటంతో అసెంబ్లీలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని కవిత గుర్తు చేశారు. దేశంలో అత్యధిక జనాభా ఉన్న బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామగ్రామాన భారత జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం అందలేదని, ఏదో ఒక రోజు అయోధ్యను సందర్శిస్తామని కవిత వివరించారు.