LIVE : తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రెస్‌మీట్ - Jagadish Reddy Pressmeet - JAGADISH REDDY PRESSMEET
Published : Jun 29, 2024, 3:20 PM IST
|Updated : Jun 29, 2024, 3:52 PM IST
BRS MLA Jagadish Reddy Pressmeet at Telangana Bhavan : కాంగ్రెస్, బీజేపీలు అంతర్గత ఒప్పందంతో పనిచేస్తున్నాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ను వదులుకుని తప్పుచేశామనే భావన ప్రజల్లో వ్యక్తం అవుతుందన్నారు. కాంగ్రెస్ అసత్య వాగ్దానాలకు మోసపోయామని ప్రజలు వాపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పథకాలను ఇవ్వకపోగా కేసీఆర్ ఇచ్చినవీ కొనసాగించలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని జగదీశ్ రెడ్డి విమర్శించారు. ప్రజలకు ఉపయోగపడే పనులు పక్కనపెట్టి సంబంధంలేని అంశాలతో బీజేపీ, కాంగ్రెస్‌లు నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయ్ తీర్మానం ప్రకారం ఫిరాయింపులు ప్రోత్సహించవద్దని ఆ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి గుర్తు చేశారని తెలిపారు. ప్రజాప్రతినిధులు ఫిరాయింపులకు పాల్పడితే వెంటనే సభ్యత్వం రద్దయ్యేలా చట్టం చేస్తామని ఎన్నిక సమయంలో చెప్పారని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటకు విరుద్ధంగా తెలంగాణలో వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను వంచిస్తోందని మండిపడ్డారు. అక్కడ రాహుల్ కాంగ్రెస్ ఒక విధానం, ఇక్కడ రేవంత్ కాంగ్రెస్ మరో విధానమని మాజీ మంత్రి ఎద్దేవా చేశారు. ఈక్రమంలోనే తెలంగాణ భవన్ నుంచి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతున్నారు.
Last Updated : Jun 29, 2024, 3:52 PM IST