తెలంగాణ

telangana

ETV Bharat / videos

తెలంగాణ ఉద్యమ స్పూర్తి గుర్తుకు వచ్చేలా ర్యాలీ చేస్తాం : కర్నె ప్రభాకర్ - BRS Leader Karne Prabhakar Comments - BRS LEADER KARNE PRABHAKAR COMMENTS

By ETV Bharat Telangana Team

Published : May 29, 2024, 6:50 PM IST

Karne Prabhakar on Telangana Emblem : అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణం, చార్మినార్​లను తొలగించేలా ప్రభుత్వం దుర్మార్గ ఆలోచనలు చేస్తోందని బీఆర్ఎస్​ నేత కర్నె ప్రభాకర్‌ ఆరోపించారు. రాచరిక పోకడలు ఉన్నాయని కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులను ధ్వంసం చేస్తారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్​ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. 

Karne Prabhakar on TS Decade Celebrations : జూన్‌ 1న సాయంత్రం 6 గంటలకు పబ్లిక్ గార్డెన్స్ నుంచి అమరజ్యోతి వరకు ర్యాలీ ఉంటుందని కర్నె ప్రభాకర్‌ తెలిపారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తి మరోసారి గుర్తు చేసేలా ఉంటుందని అన్నారు. గన్‌పార్క్ వద్ద అమరులకు బీఆర్​ఎస్​ నేత కేసీఆర్ నివాళులు అర్పిస్తారని చెప్పారు. 1000 మంది కళాకారులు, 10 వేల మంది ప్రజలతో కవాతు చేయనున్నారని పేర్కొన్నారు. జూన్‌ 2న జాతీయ జెండా, పార్టీ జెండా ఆవిష్కరణ చేస్తామని వెల్లడించారు. పదేళ్ల అభివృద్దితో ఉద్యమ యాది సమావేశం నిర్వహించనున్నట్లు వివరించారు. ఇదే సమయంలో కళింగ ఫంక్షన్ హాల్​లో ఛాయా చిత్ర ప్రదర్శన కూడా ఏర్పాటు చేయనున్నారు. జూన్‌ 3న పార్టీ జిల్లా కార్యాలయాల్లో కార్యక్రమాలు, ఆసుపత్రుల్లో పండ్లు, మిఠాయిల పంపిణీ చేస్తామని వెల్లడించారు. 

ABOUT THE AUTHOR

...view details