తెలంగాణ

telangana

ETV Bharat / videos

కాంగ్రెస్​కు పాలన చేతకాకపోతే కేసీఆర్​ను అడగండి : జగదీశ్​ రెడ్డి - Jagadeesh Reddy Fire Komati Reddy

By ETV Bharat Telangana Team

Published : Jan 22, 2024, 4:51 PM IST

Updated : Jan 22, 2024, 7:13 PM IST

BRS Leader Jagadeesh Reddy Fire on Komati Reddy Venkat Reddy :రాష్ట్రంలో ముక్కలయ్యేది బీఆర్ఎస్ కాదని, కాంగ్రెస్ పార్టీయే ముక్కలు అవుతుందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్(CM Revanth Reddy) రాష్ట్రం పరువు తీసేలా వ్యవహరిస్తున్నారని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని మండిపడ్డారు. కరెంట్ బిల్లు కట్టవద్దని చెప్పింది కోమటిరెడ్డి కాదా అని ప్రశ్నించారు.  కోమటిరెడ్డి బాస్ వైఎస్, సీఎం రేవంత్ రెడ్డి బాస్ చంద్రబాబు, ఇద్దరూ కలిసి కూడా తమ పార్టీని ఏం చేయలేకపోయారని గుర్తు చేశారు. 

 Jagadeesh Reddy Comments on Congress : హామీల నుంచి తప్పించుకునే క్రమంలో భాగంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. రైతులు యూరియా కోసం క్యూలో నిలబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితంలో ఏ రోజైనా కృష్ణా జలాల గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. పాలన చేయలేకపోతే కేసీఆర్​ను అడగమని సలహా ఇచ్చారు. నీళ్లు ఎలా ఇవ్వాలో చెబుతారని సూచించారు. ఏపీ సీఎం జగన్ నీళ్లు తోడుకుంటుంటే మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

Komati Reddy Reaction on Jagadeesh Reddy Comments : ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో ఉండే తనపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబం తర్వాత జైలుకు పోయే వ్యక్తి జగదీష్​రెడ్డే అన్నారు. సిట్టింగ్​ జడ్జితో విచారణ తర్వాత జగదీశ్​రెడ్డిని జైలుకు వెళ్లడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Last Updated : Jan 22, 2024, 7:13 PM IST

ABOUT THE AUTHOR

...view details